: అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిపై కేసు
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్ పై హైదరాబాదులోని గంగాధర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. యూత్ కాంగ్రెస్ నేత నరేష్ పై అరవింద్ కుమార్ యాదవ్ తన అనుచరులు 15 మందితో కలసి దాడికి దిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, అరవింద్ కుమార్ యాదవ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, హైదరాబాదు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాటి నుంచి అరవింద్ కుమార్ యాదవ్ వర్గానికి నరేష్ తో విభేదాలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నరేష్ పై అరవింద్ కుమార్ యాదవ్ వర్గం దాడి చేసినట్టు తెలుస్తోంది. కాగా, నరేష్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, అరవింద్ కుమార్ యాదవ్ అతని అనుచరులు 15 మందిపై కేసు నమోదు చేశారు.