: ఒక్క రోజులో 22 వేల కోట్లను నష్టపోయిన చైనా కుబేరుడు
చైనా అపర కుబేరుడు వాంగ్ జియాన్ లిన్ కేవలం ఒక్క రోజులో రూ. 22 వేల కోట్ల సంపదను కోల్పోయాడు. ఇది అతని మొత్తం సంపదలో దాదాపు 10 శాతం. నిన్న చైనాతో పాటు, గ్లోబల్ మార్కెట్లన్నీ పాతాళానికి జారిపోవడంతో జియాన్ లిన్ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఇదే సమయంలో చైనా సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఈ-కామర్స్ సంస్థ 'అలీబాబా' అధినేత జాక్ మా కూడా రూ. 3,350 కోట్ల సంపదను కోల్పోయాడు. షాంఘై షేర్లు నిన్న ఏకంగా 8.49 శాతం పతనమైన సంగతి తెలిసిందే.