: అంధ్రప్రదేశ్ కు ఒక్కొక్కటీ చేస్తున్నాంగా?: అరుణ్ జైట్లీ


విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన మాట వాస్తవమేనని, అందువల్లే కేంద్రం అండగా ఉండి ఒక్కొక్క హామీ నెరవేరుస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన విద్యా వనరులన్నీ తెలంగాణలో ఉండిపోయాయని, అందువల్లే ఏపీకి నిట్ తదితర విద్యాసంస్థలను ప్రకటించామని గుర్తు చేశారు. తొలి సంవత్సరం ఏర్పడ్డ ఆర్థిక లోటును ఇప్పటికే కొంత మేరకు భర్తీ చేశామని, రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకునేందుకు మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. వెనుకబడ్డ జిల్లాల్లో ఇప్పటికే పన్ను రాయితీలు అందించామని చెప్పారు. ఈ ఉదయం సుమారు గంటన్నర పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో పలు విషయాలను కూలంకుషంగా చర్చించామని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రాన్ని, ఇప్పుడిచ్చిన పత్రాన్ని ప్రధాని పరిశీలించినట్టు జైట్లీ తెలిపారు. విభజన చట్టంలోని అన్ని హామీలనూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్రానికి అదనపు మూలధన నిధులను కేటాయించే అంశంపై నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్ లు పరిశీలిస్తున్నాయని వివరించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

  • Loading...

More Telugu News