: అనంతపురంలో నాటు తుపాకులు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నాటు తుపాకులు అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతపురంలో ఈ రోజు చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వడ్డె సుంకన్న (42) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా తుపాకుల విక్రయానికి సంబంధించిన కేసులో సుంకన్న నిందితుడిగా ఉన్నాడు. సుంకన్న దగ్గర నాటు తుపాకులు ఉన్నాయనే కచ్చితమైన సమాచారంతోనే దాడి చేశామని జిల్లా ఎస్పీ రాజశేఖర్ తెలిపారు.