: దిగ్విజయ్ వచ్చాకే వరంగల్ లోక్ సభ అభ్యర్థిపై నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ నెల 31న హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చాకే వరంగల్ పార్లమెంటరీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి విషయంలో చర్చించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయిందని మరో ఆరు లక్షల మందిని చేర్పించేందుకు ప్రయత్నించాలని డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. గాంధీభవన్ లో పార్టీ వ్యవహారాల పరిశీలకుడు కుంతియా ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.