: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ... పలు కీలక అంశాలపై చర్చ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టం అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రజలకు ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు, కేంద్ర సాయం, పారిశ్రామికాభివృద్ధి, తదితర అంశాలపై ప్రధానితో చర్చిస్తున్నారు. అంతేగాక ఆర్థికంగా ఏపీ నిలదొక్కుకునే వరకూ కేంద్రం సాయం చేయాలని మోదీని చంద్రబాబు కోరనున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని పలుమార్లు కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రధానితో చర్చించాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు ఇవాళ ఆ అంశంపై కేంద్రం నుంచి ఓ స్పష్టత తెచ్చే అవకాశం ఉందని అంతా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News