: కాశ్మీర్ జైల్లోని ఉగ్రవాదికి పాక్ నుంచి హిజబుల్ ముజాహిద్దీన్ చీఫ్ ఫోన్... ఆ సంభాషణ ఇదిగో!


తమ భూభాగం నుంచి ఉగ్రవాదులకు ఎటువంటి సాయం చేయడం లేదని పాక్ నిత్యమూ బొంకుతూనే ఉన్నప్పటికీ, మరోపక్క ఇండియాలోని ఉగ్రవాదులకు, సరిహద్దుల్లోని జైళ్లలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూనే ఉంది. తాజాగా, శ్రీనగర్ జైల్లో ఉన్న ఓ తీవ్రవాదికి, పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర సంస్థ హిజబుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కు మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. జమ్మూకాశ్మీర్ పరిధిలోని జైళ్లలో ఉన్న వారి విడుదలకు తాను డబ్బు పంపుతానని సలావుద్దీన్ హామీ కూడా ఇచ్చాడు. మన్సూర్ అహ్మద్ వని అనే పేరున్న ఆ ఉగ్రవాదితో సలావుద్దీన్ జరిపిన సంభాషణ వివరాలు బయటకు పొక్కాయి. వారు ఏం మాట్లాడుకున్నారంటే... మన్సూర్ అహ్మద్: మీరంతా బాగున్నారా? ఫోన్ తీసిన వ్యక్తి: మీరు ఇక్కడి పెద్దవారితో మాట్లాడండి సలావుద్దీన్: అస్-సలామ్ వాలేకుమ్, అక్కడ మీరంతా క్షేమమా? మన్సూర్ అహ్మద్: మీ దయతో, మేమంతా బాగానే ఉన్నాం. సలావుద్దీన్: అల్లా ఆశీస్సులు మీకుంటాయి. మీరు క్షేమంగా జైలు నుంచి త్వరలోనే బయటకు వస్తారు. మన్సూర్ అహ్మద్: సార్, మీకు ఆసిఫ్ సాహెబ్ తెలుసా? మిమ్మల్ని ఇటీవలే కలిశారు.. సలావుద్దీన్: అవును... అవును... మన్సూర్ అహ్మద్: ఇక్కడ మేము 8, 9 మందిమి,. మాపై 20 కేసులు ఉన్నాయి. వీటిపై పోరాడేందుకు న్యాయవాదిని సైతం పెట్టుకోలేకపోతున్నాం. కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు కావాలి. సలావుద్దీన్: సరే. దేని గురించీ దిగులు చెందకండి. మీపై ఉన్న కేసుల సమాచారం మాకు తెలుసు. బాధ్యతాయుతుడైన వ్యక్తితో నేను మాట్లాడాను. సమయానికి అన్ని చెల్లింపులు జరపడం మా బాధ్యత. దానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. మీ పని జరిగిపోతుంది. మన్సూర్ అహ్మద్: కృతజ్ఞతలు... మీ ప్రార్థనల్లో మమల్ని గుర్తుంచుకోండి.

  • Loading...

More Telugu News