: ఆటుపోట్లలోనూ అదరగొట్టిన ఐఓసీ ఇష్యూ... మదుపరుల నుంచి భారీ స్పందన


నిన్న చైనా ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న భారీ మార్పులు ప్రపంచ మార్కెట్లను భారీ కుదుపునకు గురిచేశాయి. భారత స్టాక్ మార్కెట్లు మరోమారు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే సెన్సెక్స్ 16 వందల పాయింట్లకు పైగా కోల్పోగా, నిఫ్టీ కూడా అంతే స్థాయిలో నష్టాలను చవిచూసింది. అయితే ముందుగానే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వాటాల విక్రయం మదుపరుల ముందుకు వచ్చేసింది. ఓ వైపు మార్కెట్లు పతనమవుతున్నా, ఐఓసీ ఇష్యూకు మాత్రం భారీ స్పందన లభించింది. సంస్థలో 10 శాతం వాటా కింద అమ్మకానికి పెట్టిన 24.28 కోట్ల షేర్ల కోసం మదుపరుల నుంచి 28.74 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆ సంస్థ ఇష్యూకు 1.18 శాతం అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.9,300 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి.

  • Loading...

More Telugu News