: తలసాని రాజీనామకు పట్టు...టీటీడీపీ నేతల అరెస్టు
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాకు టీడీపీ నేతలు పట్టుపట్టారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఛాంబర్ లో బైఠాయించారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానని తలసాని చెబుతున్నప్పటికీ ఆయన రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదో చెప్పాలంటూ ఆందోళన చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై గవర్నర్ ను 5 సార్లు, స్పీకర్ ను 7 సార్లు కలిశామని చెప్పిన టీటీడీపీ నేతలు, గత మూడు రోజులుగా గవర్నర్ ను అపాయింట్ మెంట్ కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు.