: అమిత్ షా లిఫ్టు ఘటన వెనుక కుట్ర: పాశ్వాన్ ఆరోపణ
బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రభుత్వ అతిథి గృహంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లిఫ్టులో చిక్కుకుపోయి విలవిల్లాడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన వెనుక కుట్ర ఉందంటున్నారు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. ఓ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గెస్ట్ హౌస్ లో ఇలా జరగడం మామూలు విషయం కాదని అన్నారు. అమిత్ షాకు అపాయం తలపెట్టేందుకు ఎవరో ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దీన్ని తేలిగ్గా తీసుకోలేమని, తీవ్రంగా పరిగణించాలని కోరుతూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఉన్నతస్థాయి దర్యాప్తుతో నిగ్గు తేల్చాలని అన్నారు.