: నష్టాలతో ప్రారంభమైన అమెరికా స్టాక్ మార్కెట్... 1000 పాయింట్ల పతనం


అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. 1000 పాయింట్లకు పైగా నష్టంతో డౌజోన్స్ ట్రేడవుతోంది. 2014 ఫిబ్రవరి తరువాత 1000 పాయింట్లకు పైగా పతనం డౌజోన్స్ లో నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, చైనా స్టాక్ మార్కెట్ లో ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. నేటి సాయంత్రానికి 7 లక్షల కోట్ల రూపాయల భారతీయ మదుపరుల ఆస్తులు హరించుకుపోగా, అమెరికా స్టాక్ మార్కెట్ కూడా పతనం దిశగా పయనిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి అమెరికా స్టాక్ మార్కెట్ ఎలాంటి ఫలితాల్ని నమోదు చేస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News