: షూటింగ్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్
రియాలిటీ షో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ లోని గ్రైమ్స్ కౌంటీ ప్రాంతంలో ఓ రియాలిటీ షో షూటింగ్ జరుగుతోంది. హెలికాప్టర్ తో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హెలికాప్టర్ కు ఓ భారీ వృక్షం కొమ్మలు అడ్డం తగిలాయి. వాటిని తప్పించే క్రమంలో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ ల్యాండ్ చేస్తుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కాగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.