: ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్న పాక్ హిందూ మహిళలు!


పాకిస్థాన్ లో హిందూ మహిళల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. భారత్ నుంచి పాకిస్థాన్ విడివడిన నాటి నుంచి అక్కడ హిందూ మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ లో హిందూ మహిళలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదని వారు చెబుతున్నారు. పాక్ లో హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారని వారు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం హిందూ వివాహ చట్టం లేకపోవడమేనని వారు చెబుతున్నారు. పాక్ లో హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని వారు తెలిపారు. దీంతో ఏ కారణంగానైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటా కూడా అతని భార్యకు దక్కడం లేదని వారు చెబుతున్నారు. దీంతో అలాంటి వారంతా మతం మార్చుకుని, అక్కడి ముస్లింలకు నాలుగో భార్యగానో, ఐదో భార్యగానో లేక బానిసగానో బతుకీడ్చాల్సి వస్తోందని వెల్లడించారు. కనీసం అక్కడి హిందువులకు పాక్ ప్రభుత్వం అందజేసే 'నేషనల్ డేటా బేస్ రెగ్యులేషన్ అథారిటీ' గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా లేదని వారు తెలిపారు. పాక్, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నా రాజకీయ ఎజెండా తప్ప, పాక్ లోని హిందువుల రక్షణకు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు పేర్కొంటున్నారు. 2008, 2011, 2012లలోను, ఈ ఏడాది జూలైలోను హిందూ వివాహ చట్టం బిల్లు పాక్ పార్లమెంటు ముందుకు చర్చకు వచ్చినా ఆమోదానికి నోచుకోకపోవడంతో, అది పెండింగ్ లోనే ఉందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News