: ఓటమి దిశగా లంక... 19 పరుగులకే రెండు వికెట్లు డౌన్


ప్రపంచ క్రికెట్ లో బ్యాటింగ్ దిగ్గజంగా పేరుగాంచిన కుమార సంగక్కరకు లంకేయులు విజయంతో ఘన వీడ్కోలు పలికే అవకాశాలు కనిపించడం లేదు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు నిన్న ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే నేటి ఉదయం ఆట ప్రారంభమైన తర్వాత కేవలం 19 పరుగులు చేసిన లంక మరో రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆట మొదలైన వెంటనే కెప్టెన్ మాథ్యూస్ (23) వికెట్ ను చేజార్చుకున్న ఆ జట్టు అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన యువ సంచలనం చండిమాల్ (15) వికెట్ ను కూడా కోల్పోయింది. దీంతో రెండో రోజు ఆటలో కేవలం 19 పరుగులకే లంక రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News