: 'తెలుగులో న్యాయపాలన'పై సదస్సు ప్రారంభం
న్యాయస్థానాల్లో కూడా తెలుగును అమలు చేసేందుకు రాష్ట్ర అధికార భాషా సంఘం కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజు హైదరాబాద్ లోని జూబ్లిహాల్లో 'తెలుగులో న్యాయపాలన' అన్న అంశంపై సదస్సును నిర్వహిస్తోంది. కొద్దిసేపటి క్రితమే దీనిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, పలువురు మంత్రులు, ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు హాజరయ్యారు.
దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, పలువురు మంత్రులు, ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు హాజరయ్యారు.