: పెనుమాక చేరుకున్న పవన్ కల్యాణ్... ఘన స్వాగతం పలికిన రైతులు, అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని పెనుమాకకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. నేటి ఉదయం 7 గంటలకే హైదరాబాదులోని తన ఇంటి నుంచి కారులో రోడ్డు మార్గం మీదుగా బయలుదేరిన పవన్ కల్యాణ్ తొలుత 'హాయ్ ల్యాండ్'లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లి చేరుకుని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం నేరుగా పెనుమాకలో ఏర్పాటు చేసిన వేదికకు చేరుకున్నారు. హాయ్ ల్యాండ్ నుంచే పవన్ కాన్వాయ్ వెంట ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలివచ్చారు. వేదిక వద్ద రైతులు పవన్ కు కేరింతలతో స్వాగతం పలికారు. వేదికపై కిందే కూర్చున్న పవన్ కల్యాణ్ రైతులతో నేరుగా మాట్లాడేందుకు యత్నిస్తున్నారు.