: వింటుంటే రాకెట్లా దూసుకుపోతున్నట్టు ఉంటుంది: చిరంజీవి


తన జన్మదిన వేడుకలను అభిమానులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ను అభినందించారు. ఓ సినిమా ఈవెంట్ తరహాలో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదని అన్నారు. వినోద కార్యక్రమాలను అద్భుతంగా ప్రజెంట్ చేశారని కితాబిచ్చారు. అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతలు వింటుంటే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుందని, రాకెట్ లా దూసుకుపోతున్నట్టుగా ఉంటుందని, వెయ్యేనుగుల బలంతో పుంజుకుని ముందుకు సాగుతున్నట్టుగా ఉంటుందని చిరంజీవి ఉద్వేగంతో చెప్పారు. ఆ ఈలలు, చప్పట్లు, కేరింతలకు అంతటి ప్రభావం ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News