: వాళ్లను మించిపోవాలని కోరుకోవడంలేదు: రామ్ చరణ్


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలో తనయుడు రామ్ చరణ్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. తండ్రి ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని తమకెప్పుడూ విలువలు నేర్పలేదని, ఆయనను చూసి తామే నేర్చుకున్నామని తెలిపారు. "మాలో ఏదైనా మంచితనం ఉందంటే అది మీ వల్లే డాడీ!" అని రామ్ చరణ్ తన తండ్రిని ఉద్దేశించి అన్నారు. ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని, తండ్రి, బాబాయిలను మించిపోవాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అంతకుముందు, చిరంజీవి 150వ చిత్రం ఆలస్యానికి ఓ రకంగా తానూ కారణమేనని, అందుకు క్షమించాలని అభిమానులను కోరారు. ఓ స్క్రిప్టు విషయంలో తన తండ్రి "యస్" అని ఒక్కమాట చెబితే సినిమాను మొదలుపెడతానని అన్నారు.

  • Loading...

More Telugu News