: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు హతం


ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో నెంబర్ 2 నాయకుడిగా ఉన్న ఫాదిల్ అహ్మద్ అల్ హయాలీ మృతి చెందాడు. అమెరికా జరిపిన వైమానిక దాడిలో అతను హతమయ్యాడని తెలిసింది. ఈ నెల 18న ఇరాక్ లోని మోసుల్ సమీపంలో అతడు వాహనంలో వెళుతుండగా అమెరికా జరిపిన వైమానిక దాడిలో చనిపోయినట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. అతను ఇస్లామిక్ స్టేట్ ముఖ్యనాయకుడని, ఇరాక్, సిరియా దేశాలకు వాహనాలు, ఆయుధాలు, బాంబులు తరలిస్తూ ఉంటాడని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీకి హయాలీ అత్యంత సన్నిహితుడని, ఇరాక్, సిరియా దేశాల్లో ఐఎస్ సంస్థ కార్యకలాపాలకు ఇన్ ఛార్జిగా వ్యవహరించేవాడని వైట్ హౌస్ ప్రతినిధి వివరించారు. కాగా హయాలీతో పాటు అబూ అబ్దుల్లా అనే మరో ఉగ్రవాది కూడా మరణించాడు.

  • Loading...

More Telugu News