: బుల్లెట్ నడిపిన బాలయ్య... కేరింతలు కొట్టిన హిందూపురం వాసులు
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న తన సొంత నియోజకవర్గం హిందూపురంలో సందడి చేశారు. ఇటీవలే మూడు రోజుల పాటు అక్కడ పర్యటించిన బాలయ్య, వారం తిరక్కుండానే నిన్న మళ్లీ అక్కడికి వెళ్లారు. హిందూపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్లిన బాలయ్య, సరదాగా బుల్లెట్ నడిపారు. హిందూపురం నుంచి కొడికొండ చెక్ పోస్టు వరకూ ఆయన బుల్లెట్ పైనే వెళ్లారు. బాలయ్య బుల్లెట్ ఎక్కడంతో అక్కడి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు.