: నేడు చిరంజీవి 60వ జన్మదినం.. వేడుకలకు అమితాబ్, రజనీకాంత్ తదితరులు


తెలుగు చలన చిత్ర ప్రముఖుడు, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవికి నేటితో 60 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిన్న రాత్రే హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భారీ కేక్ ను కట్ చేశారు. ఇక నేడు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో చిరు బర్త్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. చిరు తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ్ ఈ వేడుకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ వేడుకలకు రాజకీయ ప్రముఖులే కాక టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇక ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా భారత చలన చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.

  • Loading...

More Telugu News