: బీహార్ లో లిఫ్టులేమో చిన్నవి... లావుగా ఉన్నవాళ్లు ఎక్కితే ఎలా?: అమిత్ షాపై లాలూ వ్యంగ్యం


పాట్నాలోని ఓ ప్రభుత్వ అతిథి గృహంలో బీజేపీ నేషనల్ చీఫ్ అమిత్ షా లిఫ్టులో చిక్కుకుపోయి నానా హైరానా పడిపోవడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. బీహార్ లో లిఫ్టులు చిన్నవని, వాటిలో భారీ కాయం కలిగిన వ్యక్తులు ఎక్కరాదని వ్యంగ్యం ప్రదర్శించారు. అమిత్ షా లావుగా ఉన్నందునే లిఫ్ట్ ఆగిపోయిందని అన్నారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు లిఫ్ట్ ఎక్కకపోవడమే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. లాలూ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. నితీశ్ కుమార్ సర్కారు నిర్లక్ష్యం కారణంగానే 'లిఫ్టు' ఘటన చోటుచేసుకుందని బీజేపీ నేతలు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News