: డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్1-బి వీసా వ్యతిరేక వ్యాఖ్యలపై మార్క్ జుకర్ బర్గ్ ఆక్షేపణ


వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చి హెచ్1-బీ వీసాలను పొందుతూ, అమెరికన్ల పొట్ట కొడుతున్న విదేశీయులను అరికట్టాలంటూ, అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మండిపడ్డారు. ట్రంప్ వీసా విధానం అమెరికన్ నాయకత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని, వినూత్నత, ఔత్సాహికతలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. అమెరికన్ ఖజానాపై 400 నుంచి 500 బిలియన్ డాలర్ల భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, జుకర్ బర్గ్ సహా, ఐటీ కంపెనీలన్నీ హెచ్1-బీ వీసా విధానాన్ని మరింత సరళతరం చేయాలని వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీసాలను పొంది అమెరికాకు వెళ్తున్న విదేశీయుల్లో భారతీయులే అధికం. దీంతో వీసాపై జరుగుతున్న చర్చ భారత టెక్ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

  • Loading...

More Telugu News