: నా సొంత గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా: డీజీపీ రాముడు
అనంతపురం జిల్లాలోని నార్కెట్ పల్లి గ్రామాన్ని ఏపీ డీజీపీ రాముడు ఈ రోజు సందర్శించారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ, తాను దత్తత తీసుకున్న తన సొంత గ్రామం నరసింహపల్లిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా కృషి చేస్తానని చెప్పారు. భారతదేశ సివిల్ సర్వీసు అధికారులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రభుత్వ పిలుపుతో అనంతపురం జిల్లాలోని తన సొంత గ్రామం నరసింహపల్లిని డీజీపీ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.