: నాకు పవన్ అయినా, రాంచరణ్ అయినా ఒక్కటే: చిరంజీవి
తనకు పవన్ కల్యాణ్ అయినా, రాంచరణ్ అయినా ఒకటేనని, వీరిద్దరిలో ఎవరికి హిట్ వచ్చినా, తనకు ఎంతో ఆనందం కలుగుతుందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. రేపు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరగనున్న సందర్భంగా ఓ టెలివిజన్ చానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గి, పవన్ కు పెరిగిందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు "అట్లా ఏమీ అనుకోవట్లేదు. బిడ్డ అభివృద్ధిలోకి వస్తే కన్నతండ్రికి ఎలాంటి ఆనందం ఉంటుందో, ఎలాంటి పుత్రోత్సాహం ఉంటుందో... రాంచరణ్ గానీ, పవన్ కల్యాణ్ గానీ.. ప్రజాదరణ విషయంలో వీళ్లిద్దరిలో ఎవరు ఎదుగుతున్నా సరే, అదే పుత్రోత్సాహాన్ని నేను అనుభవిస్తుంటాను" అన్నారు.