: కార్ల ధరలు పెంచిన మారుతి సుజుకి


దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేసి విక్రయిస్తున్న మారుతి సుజుకి, ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్-క్రాస్ మినహా మిగతా అన్ని రకాల కార్ల ధరలనూ పెంచింది. ఎక్సైజ్ సుంకాల పెంపు భారాన్ని కస్టమర్లపై మోపక తప్పడం లేదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంచుకునే కారు వేరియంట్ ను బట్టి రూ. 3 వేల నుంచి రూ. 9 వేల వరకూ ధరలు పెరుగుతాయని వివరించారు. కాగా, జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 2014-15తో పోలిస్తే 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్ల రూపాయలకు చేరింది. గడచిన మూడు నెలల కాలంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నా, మారుతి సుజుకి ఈక్విటీ విలువ 26 శాతం పెరిగింది. ఇండియాలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ నెల ఆరంభంలో తామందిస్తున్న వాహనాల ధరలను రూ. 30 వేల వరకూ పెంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News