: జనగాంలో కిక్-2 సినిమాకు అంతరాయం... తెరను చించేసిన ఫ్యాన్స్


మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా కిక్-2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, వరంగల్ జిల్లా జనగాంలోని దేవీ థియేటర్ లో కిక్-2 సినిమా ప్రదర్శనకు మధ్యలో అంతరాయం కలిగింది. దాంతో, ఫ్యాన్స్ వీరంగం వేశారు. తెరను చించివేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. సాంకేతిక కారణాల వల్లే ప్రదర్శనకు అంతరాయం కలిగిందని థియేటర్ సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అభిమానులు శాంతించలేదు. ఆగ్రహంతో ఊగిపోయారు.

  • Loading...

More Telugu News