: కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారు: విజయసాయి రెడ్డి
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంటుందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు హోదా గురించి కేంద్రాన్ని అడగకుండా నాన్చుతున్నారని ఆరోపించారు. ఒకవేళ హోదా అడిగితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఎక్కడ తెగిపోతాయోనన్న భయం ఆయనకు ఉందని విజయసాయి విమర్శించారు. విశాఖలో ఈరోజు పలు ట్రేడ్ యూనియన్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం వైసీపీ ఈ నెల 29న ఇచ్చిన బంద్ కు అన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతిచ్చాయని తెలిపారు. హోదా సాధించే వరకూ తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.