: టాలీవుడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కు సొంత డ్రైవర్ టోకరా...కారు, రూ.21 లక్షల నగదుతో పరారీ
తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన ఓ ప్రముఖుడికి ఆయన సొంత కారు డ్రైవర్ మస్కా కొట్టాడు. ఖరీదైన కారుతో పాటు రూ.21 లక్షల నగదుతో పరారయ్యాడు. డ్రైవర్ చేతివాటంపై కాస్త ఆలస్యంగా మేల్కొన్న సదరు ప్రముఖుడు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకెళితే... టాలీవుడ్ లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా చిరపరచితులైన వాసుదేవరావు తన డ్రైవర్ చేతిలోనే మోసానికి గురయ్యారు. బంజారా హిల్స్ లో నేటి ఉదయం వాసుదేవరావు ఏమరపాటును ఆసరా చేసుకున్న ఆయన కారు డ్రైవర్ స్కోడా కారుతో పాటు అందులో పెట్టిన రూ.21 లక్షల నగదుతో పరారయ్యాడు. దీనిపై వాసుదేవరావు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.