: మన 'కుంభ మేళా'పై హార్వార్డ్ వర్శిటీ ప్రశంసలు


రెండేళ్ల క్రితం అలహాబాద్ లో గంగానదికి నిర్వహించిన మహా కుంభమేళాకు ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీ ప్రశంసలు కురిపించింది. బ్రెజిల్ లో ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల నిర్వహణ కంటే గంగానది కుంభమేళా నిర్వహణ బాగుందని వర్శిటీ రీసెర్చ్ విద్యార్థులు 'కుంభమేళా - మ్యాపింగ్ ది ఎఫిమిరల్ మెగా సిటీ' పేరిట రచించిన పుస్తకంలో పేర్కొంది. 2013లో జనవరి - ఫిబ్రవరి మధ్య 55 రోజుల పాటు మహా కుంభమేళా ఉత్సవాలు వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 447 పేజీలున్న ఈ పుస్తకంలో దాదాపు 24 చదరపు కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక 'కుంభ్' నగరాన్ని నిర్మించారని, అన్ని మౌలిక వసతులూ కల్పించారని పేర్కొంది. వర్శిటీలోని అర్బన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, బిజినెస్, ఆర్కిటెక్చర్, కల్చర్ విభాగాలకు చెందిన విద్యార్థులు, ఫ్యాకల్టీలు పుస్తక రచనలో పాలు పంచుకున్నారు. ఇక్కడ జరిగిన ఏర్పాట్లు అద్భుతమని, 10 కోట్ల మంది ఒకే చోట చేరితే, వారందరి అవసరాలను సంతృప్తికరంగా తీర్చారని తెలిపింది. ఒకే స్థలంలో అత్యధిక సీడీఆర్ (కాల్ డీటెయిల్ రిపోర్ట్) ఈ ప్రాంతంలోనే నమోదైందని, కుంభమేళా సమయంలో 14.6 కోట్ల టెక్ట్స్ మెసేజ్ లు, 24.5 కోట్ల కాల్స్ ఇక్కడి నుంచి వెళ్లాయని వివరించింది. కాగా, ఈ పుస్తకాన్ని ఇటీవల యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News