: ఏ క్షణమైనా యుద్ధం, సిద్ధంకండి: ఉత్తరకొరియా సైన్యానికి కిమ్ జాంగ్ ఆదేశం


కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ఏ క్షణమైనా పొరుగు దేశంతో యుద్ధం చేయాల్సి రావచ్చని, సైన్యం సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని సెంట్రల్ మిలటరీ కమిషన్ సమావేశమై, సరిహద్దుల్లో కౌంటర్ ఎటాక్ లకు వెనుకాడవద్దని ఆదేశించింది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ)లోని ఫ్రంట్ లైన్ విభాగం సన్నద్ధం కావాలని తెలిపింది. ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా కాల్పులు కొనసాగుతున్న వేళ కిమ్ ఈ ప్రకటన చేయడం ప్రపంచ దేశాల్లో కలకలం రేపింది. మరోవైపు దక్షిణ కొరియా సైతం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో సైన్యాన్ని సిద్ధం చేసింది. సరిహద్దుల్లో అలజడికి ఉత్తర కొరియానే కారణమని, కవ్వింపు చర్యలు జరిపినా, దురాక్రమణకు దిగినా తాము చూస్తూ ఊరికే ఉండబోమని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News