: పదేపదే మందుకొట్టి పట్టుబడే రాజుగారికి అత్యధిక శిక్ష!


ఆయన పేరు బలరామ్ రాజు. ఎప్పుడూ తాగి బండిని నడుపుతూ పట్టుబడటమే ఆయన పని. మరోసారి పూటుగా తాగి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఈ దఫా కోర్టు జరిమానా రెండు లేదా మూడు రోజుల జైలుశిక్షతో వదల్లేదు లెండి. 2013లో తాగి నడిపే వాళ్లను పట్టుకోవడం మొదలు పెట్టిన తరువాత హైదరాబాదులోని మీర్ చౌక్, సుల్తాన్ బజార్, బహదూర్ పురా, మలక్ పేట, అబిడ్స్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ రాజుగారు పట్టుబడి జరిమానాలు కట్టి, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ నెలలో కాచిగూడ పరిధిలో ఇంకోసారి అడ్డంగా దొరికిపోయాడు. తాగి వాహనం నడపటమే పనిగా పెట్టుకున్న ఇతని చర్యలను కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఏకంగా మూడు నెలల జైలు శిక్షను విధిస్తూ, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పిచ్చారు. మరో రూ. 2 వేల జరిమానా కూడా విధించారు. కాగా, హైదరాబాదులో పట్టుబడ్డ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అత్యధిక కాలం జైలు శిక్ష పడ్డ కేసు ఇదేనని సమాచారం.

  • Loading...

More Telugu News