: మహేష్ బాబును చిట్కా అడిగిన టీడీపీ ఎంపీ


సినీ నటుడు మహేష్ బాబును టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చిట్కా అడిగారు. శ్రీమంతుడు సక్సెస్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, సమాజానికి చక్కని సందేశం ఇచ్చారని అన్నారు. సామాజిక అంశాన్ని ఇంత కమర్షియల్ గా చెప్పవచ్చా? అని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారని ఆయన ప్రశంసించారు. తెలుగు సినిమాలకు పెద్ద అభిమానినని తెలిపిన రామ్మోన్ నాయుడు, మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమా నుంచి చూస్తున్నానని అన్నారు. అప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నారని, తాము మాత్రం పెద్దవారమైపోతున్నామని తెలిపారు. అలా ఉండడానికి చిట్కా ఏదన్నా చెబితే బాగుంటుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే ఎవరూ తమవైపు చూడడం లేదని, మహేష్ బాబు ఏదన్నా చిట్కా చెబితే సంతోషమని రామ్మోహన్ నాయుడు అడగడంతో మహేష్ బాబు నవ్వేశాడు.

  • Loading...

More Telugu News