: మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్న ఎఫ్టీఐఐ విద్యార్థులు


పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థుల ఆందోళన పర్వం కొనసాగుతోంది. ఇన్ స్టిట్యూట్ కు చైర్మన్ గా టీవీ నటుడు, బీజేపీ సభ్యుడు గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై ఎఫ్టీఐఐ విద్యార్థి సంఘం (ఎఫ్ఎస్ఏ) ప్రతినిధి వికాస్ అర్స్ మాట్లాడుతూ... "ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి ఎఫ్టీఐఐని సందర్శించాలి. తామెదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత ధోరణిని గమనించి దేశంలోని విద్యార్థులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు ఆందోళనను తీవ్రం చేయాలి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News