: బ్యాంకులు, షోరూమ్ లే లక్ష్యం...హైదరాబాదులో దోపిడీ దొంగల హల్ చల్


హైదరాబాదులో కాల్పుల కలకలం రేగింది. రాయచూర్, గుల్ బర్గా ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు దోపిడీ దొంగల ముఠా ఐదురోజులుగా హైదరాబాదులో మకాం వేసింది. నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా నేడు ప్రణాళికను అమలు చేసింది. బ్యాంకులు, షోరూములను పరిశీలించి, ఏఏ బ్యాంకుల్లోంచి ఎవరెవరు డబ్బులు జమ చేస్తారు? ఎవరు విరివిగా డ్రా చేస్తారు? గమనించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న నీరూస్ షోరూం, బిగ్ సీ దుకాణదారులు డబ్బులు జమ చేసే సందర్భాలను గుర్తించి వారిని దోచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో నీరూస్ షోరూంకి చెందిన ఉద్యోగి డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తుండగా, అతనిని అటకాయించి, తుపాకీతో బెదిరించి డబ్బు లాక్కున్నారు. ఆయనిచ్చిన సమాచారంతో రంగంప్రవేశం చేసిన పోలీసులు, దోంగలను వెంబడించడం ప్రారంభించారు. పోలీసులు ఫాలో అవుతున్నారని గ్రహించిన దొంగలు వారిపై కాల్పులు జరిపారు. అయినా వెన్ను చూపని పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. పట్టుకున్న వారిని కర్ణాటకకు చెందిన షహీన్ మీర్జా, అబ్దుల్ సత్తార్ గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నారు. కాగా, షహీన్ మీర్జా, అబ్దుల్ సత్తార్ జరిపిన రెండు రౌండ్ల కాల్పుల్లో ఎల్ అండ్ టీ ఉద్యోగి ధర్మేంద్ర గాయపడ్డారు. అతనిని అసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News