: కోహ్లీ ఔట్... సెంచరీకి చేరువలో రాహుల్


శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కోలుకుంది. ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయినప్పటికీ... కోహ్లీ, లోకేష్ రాహుల్ లు సమయానుకూలంగా ఆడి భారత్ ను గాడిలో పెట్టారు. అయితే 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. హెరాత్ బౌలింగ్ లో మ్యాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. మరోవైపు లోకేష్ రాహుల్ 94 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లీ, రాహుల్ ఇద్దరూ కలసి 164 రన్స్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. కోహ్లీ ఔటైన తర్వాత రోహిత్ శర్మ (6) క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు.

  • Loading...

More Telugu News