: తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్


రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మురళీ విజయ్ పరుగులేమీ చేయకుండానే దమ్మిక ప్రసాద్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కు రహానే జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లో 8 పరుగులు. లోకేష్ 4 రన్స్ చేయగా, మరో 4 పరుగులు లెగ్ బైస్ రూపంలో వచ్చాయి.

  • Loading...

More Telugu News