: రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడం కొంచెం కలవర పరుస్తోంది. ఇప్పటిదాకా వర్షం పడనప్పటికీ, మేఘాలు రావడంతో పిచ్ పై కవర్లు కప్పారు. టీమిండియా జట్టులో మూడు మార్పులు జరిగాయి. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్ ల స్థానంలో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ లు తుది జట్టులో చేరారు. శ్రీలంక జట్టులో గాయపడ్డ నువాన్ ప్రదీప్ స్థానంలో దుష్మంత చామర వచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక ఛాంపియన్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర తన కెరీర్ కు ముగింపు పలుకుతున్నాడు.