: 25న మోదీతో చంద్రబాబు భేటీ


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 25న భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కీలక భేటీగా పరిగణిస్తున్న ఈ సమావేశం అసలు ఈరోజు జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) ఈ భేటీని వాయిదా వేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తదుపరి భేటీకి అనుకూలమైన రోజును నిర్ణయించాలని కోరుతూ పీఎంఓ సూచించిన తేదీల్లో ఏపీ సీఎంఓ 25వ తేదీకే మొగ్గు చూపింది. ఇప్పటికే బాగా ఆలస్యమైపోతోందని భావిస్తున్న చంద్రబాబు, సాధ్యమైనంత త్వరగా ప్రధానితో భేటీ కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 25వ తేదీనే ఆయన ఎంచుకున్నారు.

  • Loading...

More Telugu News