: విద్యార్థులు నన్ను వేధించారు: ఎఫ్టీఐఐ డైరెక్టర్
విద్యార్థులు తనను వేధించడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పూణేలోని ఎఫ్టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ ప్రశాంత్ పథ్రబే తెలిపారు. ఎఫ్టీఐఐ ఛైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమించడంపై ఎఫ్టీఐఐ విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఆయన నియామకం రద్దుచేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తనతో అనుచితంగా ప్రవర్తించేవారని, మర్యాద లేకుండా ఇష్టానుసారం మాట్లాడేవారని అన్నారు. విద్యార్థుల మాటలతో ఎంతో విసిగిపోయానని ఆయన చెప్పారు. ఒక దశలో మానసికంగా కుంగిపోయానని కూడా ఆయన చెప్పారు. అందువల్లే ఎవరు చెప్పినా వినకుండా విద్యార్థులపై ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. కాగా, ఆయన ఫిర్యాదుతో ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు, బెయిల్ లభించడంతో నేటి మధ్యాహ్నం విడుదల చేశారు.