: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా: అలియా భట్
షారూఖ్ ఖాన్ తో నటించబోయే సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నానని బాలీవుడ్ కథానాయిక నటి అలియా భట్ తెలిపింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అలియా భట్ 'హైవే', 'టూ స్టేట్స్', 'హంప్టీ శర్మ కీ దుల్హన్' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 'షాందార్', 'కపూర్ అండ్ సన్స్' సినిమాల్లో నటిస్తున్న అలియా, త్వరలో ప్రారంభమయ్యే షారూఖ్ ఖాన్ 'ఫ్యాన్' సినిమాలో హీరోయిన్ గా ఖరారైంది. దీంతో ఉత్సాహం పట్టలేకపోతోంది. ఈ సినిమాకు 'ఇంగ్లిష్ వింగ్లిష్' ఫేం గౌరీ షిండే దర్శకత్వం వహిస్తుండడంతో తన ఇంగ్లిష్ భాషా సమస్య కూడా తీరిపోనుందని అలియా భట్ ట్వీట్ చేసింది.