: ఆగస్టు 21న, 21 మంది న్యాయమూర్తులను చంపేస్తాం...హెచ్చరికలు


ఆగస్టు 21న పంజాబ్, హర్యానా హైకోర్టులోని 21 మంది న్యాయమూర్తులను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులను హెచ్చరికలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు హైకోర్టుల్లో పని చేస్తున్న 21 మంది న్యాయమూర్తులను ఈ నెల 21న బాంబు పేలుళ్ల ద్వారా చంపేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ ప్రెస్ క్లబ్ మేనేజర్ జతీంద్రపాల్ సింగ్ కు ఓ లేఖ వచ్చింది. తమ కమాండర్స్ ను చంపినందుకు ప్రతీకారంగా వీరిని చంపుతామని లేఖలో పేర్కొన్నారు. పంజాబీలో ఉన్న ఆ లేఖలో ఆగస్టు 21న బ్లాక్ డేగా పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైకోర్టు వద్ద భద్రతను పెంచారు. న్యాయమూర్తులకు సెక్యూరిటీని పెంచారు. లేఖ విషయంలో ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News