: మోదీ జీ... విద్యార్థులేమీ క్రిమినల్స్ కాదు: ఎఫ్టీఐఐ విద్యార్థుల అరెస్టుపై రాహుల్ ఆగ్రహం
పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులను అరెస్టు చేయడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేయడానికి వారేమీ క్రిమినల్స్ కాదని ట్వీట్ చేశారు. 'మౌనం, సస్పెండ్, అరెస్ట్'... బీజేపీ హామీ ఇచ్చిన 'అచ్చేదిన్' కు అవి నిదర్శనాలని ఎద్దేవా చేశారు. ఎఫ్టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియమకాన్ని వ్యతిరేకిస్తూ కొన్నివారాలుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఇన్ స్టిట్యూట్ డైరక్టర్ ప్రశాంత్ పత్రాబేను ఘెరావ్ చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు.