: '7777' కోసం దౌర్జన్యానికి దిగిన ప్రజాప్రతినిధి అనుచరులు!


వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్య ఆకర్షణీయంగా ఉండాలని భావిస్తూ, వేల నుంచి లక్షల రూపాయల వరకూ పోటీపడి కొనుక్కుపోతుంటారని అందరికీ తెలిసిందే. అయితే, అటువంటి ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు దౌర్జన్యం చేశారు. మిగతా వారిని పోటీలో ఉండకుండా చేయాలని చూశారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. '7777' నంబరును తాము పొందాలన్న ఉద్దేశంతో వచ్చిన కొందరు వ్యక్తులు క్యూలో నిలబడ్డ వారిని వెనక్కు నెట్టేశారు. అదేమని ప్రశ్నించిన వైవీఆర్ డెవలపర్స్ యజమానిపై దాడి చేశారు. అతని వాహనం సీబుక్, టెండరు ఫారాలు లాగేసుకున్నారు. ఈ ఘటనపై సూర్యారావు పేట పోలీసులకు ఆర్డీవో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేశారు.

  • Loading...

More Telugu News