: గోవా మాజీ సీఎంకు ఊరట... లంచం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ కు నేటి ఉదయం కొంత ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఆ రాష్ట్ర ప్రత్యేక కోర్టు సానుకూలంగా స్పందించింది. దిగంబర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీఎంగా ఉండగా దిగంబర్ కామత్ ఓ సంస్థ నుంచి రూ.కోటి లంచం పుచ్చుకున్నారంటూ నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.