: బుద్ధి పోనిచ్చుకోని పాక్, ఇండియాతో చర్చలకు ముందు వేర్పాటువాదులతో సమావేశం


పాకిస్థాన్ బుద్ధి మారలేదు. ఇండియా, పాక్ ల మధ్య దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యల పరిష్కారానికి కార్యదర్శుల స్థాయి చర్చలకు సిద్ధమవుతున్న వేళ, వేర్పాటు వాదులతో సమావేశం కావాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు కాశ్మీరు లోయలోని వేర్పాటువాదులకు ఆహ్వానాలు అందాయి. పాక్ హై కమిషన్ వేర్పాటు వాదులను ఆహ్వానిస్తూ, సత్రాజ్ అజీజ్ ఇండియాకు రాగానే, వచ్చి సమావేశం కావాలని కోరింది. దేశ రాజధానిలో అజీజ్, వేర్పాటు వాదులకు మధ్య సమావేశాన్ని పాక్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేసింది. హురియత్ కాన్ఫరెన్స్ కు చెందిన సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్, నయీమ్ ఖాన్, యాసిన్ మాలిక్ తదితరులకు పాక్ హై కమిషన్ నుంచి ఇన్విటేషన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. సత్రాజ్ అజీజ్ కు ఇచ్చే 'రిసెప్షన్ పార్టీ'కి రావాలని వీరిని ఆహ్వానించారు. ఈ నెల 23న సాయంత్రం వేర్పాటువాదులకు, అజీజ్ కు మధ్య చర్చలు జరుగుతాయని సమాచారం. ఇండియాతో చర్చలకు ముందు తమ వాదన వినాలన్నది పాక్ అభిమతమని హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News