: మహిళలకూ 'వయాగ్రా' వచ్చేసింది... విక్రయాలకు అనుమతించిన యూఎస్ ఎఫ్డీఏ


ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా (అధికారికంగా) మహిళల్లో లైంగిక వాంఛలను పెంచే ఔషధం అందుబాటులోకి వచ్చింది. స్ప్రౌట్ ఫార్మాస్యుటికల్స్ తయారు చేసిన 'యాడ్ ఈ'(addyi) ఔషధాన్ని మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. మహిళల లైంగిక అవసరాలను మరుస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను చూపుతున్నారని ఇంతవరకూ ఎఫ్డీఏపై విమర్శలు వస్తుండేవి. తాజాగా ఈ ఔషధానికి అనుమతి ఇవ్వడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "అమెరికా చరిత్రలో ఇది ఓ పెనుమార్పు, మహిళల లైంగికారోగ్యం ఈ మాత్రలతో మెరుగుపడుతుంది" అని నేషనల్ కన్స్యూమర్స్ లీగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాలీ గ్రీన్ బర్గ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మాత్రలతో రక్తపీడనం తగ్గుతుందని, నిద్ర ముంచుకురావడం, నిస్సత్తువ కలుగుతాయన్న విమర్శలూ ఉన్నాయి. మొత్తం 24 మంది సభ్యులున్న ఎఫ్డీఏలో ఈ ఔషధం మార్కెట్లోకి విడుదల చేయాలా? వద్దా? అని ఓటింగ్ పెడితే, 18 మంది అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా ఓటేశారు. 'పింక్ వయాగ్రా' అని కూడా పిలుచుకునే ఈ 'యాడ్ ఈ' అక్టోబర్ 2017 తరువాతే అందుబాటులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News