: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ ఏపీ కేడర్ కు వెళ్లాల్సిందే... క్యాట్ కు తేల్చిచెప్పిన కేంద్రం


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఇకపై ఆ పోస్టులో కొనసాగడం దుర్లభంగానే కనిపిస్తోంది. పురపాలనలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న సోమేశ్ కుమార్ ను రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ కేడర్ కు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సోమేశ్ కుమార్ ను ఏపీకి బదలాయించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ససేమిరా అంటున్నారు. తనవంతు ప్రయత్నాలు చేయడంతో పాటు క్యాట్ లో సోమేశ్ తోనూ కేసీఆర్ పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్ పై నిన్న జరిగిన విచారణ సందర్భంగా ‘‘ఏపీకి అలాట్ అయిన మీరు తెలంగాణలో కొనసాగుతానని ఎలా సమర్థించుకుంటారు’’ అంటూ క్యాట్ ఆయనను సూటిగా ప్రశ్నించింది. అంతేకాక కేంద్ర ప్రభుత్వం కూడా సోమేశ్ పిటిషన్ ను తప్పుబట్టింది. ఏపీకి కేటాయించిన సోమేశ్ కుమార్ ను తెలంగాణలో కొనసాగించడం కుదరదని కూడా కేంద్రం తన వైఖరిని క్యాట్ కు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్యాట్ తీర్పు రాగానే సోమేశ్ ఏపీకి తరలివెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News