: టీఎస్ 'ఎడ్ సెట్' టాప్ ర్యాంకర్లిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ టాప్ ర్యాంకర్లు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కృష్ణకాంత్, లింగస్వామి అనే సోదరులు వందకు వంద మార్కులతో స్టేట్ ఫస్ట్, సెకెండ్ ర్యాంకులు సాధించారు. వందకు వంద మార్కులు రావడంతో అనుమానం వచ్చిన ఎడ్ సెట్ కన్వీనర్ వీరిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని తేల్చుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ తమకు బదులు మరొకరితో పరీక్ష రాయించారని కన్వీనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి అరెస్టుపై రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.