: గ్రీస్ కు గోరు చుట్టుపై రోకలిపోటు!


అసలే ఆర్థిక సంక్షోభలో కూరుకుపోయిన గ్రీస్ ను ఇప్పుడు వలసపోటు పీడిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలతో జరిగిన ఆంక్షల ఒప్పందంతో జాగ్రత్తలు తీసుకుంటున్న గ్రీస్ ను వసల వాదులు ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలు అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశాలను వీడి, స్థానికులు పెద్ద ఎత్తున తరలుతున్నారు. లిబియా తీరం గుండా మధ్యధరా సముద్రం ద్వారా వీరు యూరోప్ చేరుకుంటున్నారు. ఈ మార్గంలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకోవడానికి తోడు భద్రత కూడా కట్టుదిట్టమైంది. దీంతో వీరంతా ఏజియన్ సముద్రం గుండా ప్రయాణించి గ్రీస్ పరిధిలోని ద్వీపాలను చేరుకుంటున్నారు. ఇలా జనవరి 1 నుంచి ఆగస్టు 14 లోపు 15 లక్షల మంది శరణార్ధులు గ్రీస్ ద్వీపాల్లో పాగా వేశారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సహాయ కమిషన్ అధికార ప్రతినిధి విలియం స్ప్లిండ్లర్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే గ్రీస్ కు మరింత నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రీస్, భద్రతను కట్టుదిట్టం చేసి వలసలను కట్టడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లేని పక్షంలో గ్రీస్ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయన హెచ్చరించారు. అయితే చెల్లాచెదురుగా పడి ఉన్న 6 వేల ద్వీపాల సముదాయమైన గ్రీస్ లో భద్రతను కట్టడి చేయడం సాధ్యమైన పనేనా? సైప్రస్ ప్రభుత్వం ఆ పనిని సమర్థవంతంగా చేయగలుగుతుందా? అనే అసక్తి అందర్లోనూ నెలకొంది.

  • Loading...

More Telugu News